Thursday, May 6, 2021

కరోనా కల్లోలం

కాలం ఎంత కఠినమైనది.
దానికి మనసు, మానవత్వం వుండవేమో..

కరోన అనే రాకాసి జీవి
మానవాలిపై నిరంతర యుధాన్ని ప్రకటించి
జీవితాల్ని నిర్దాక్షిణ్యంగా తించుతుంటే
చూస్తూ.. వికటాట్ట హాసం చేస్తోంది ఈ కాలం.

ఆయుధాలు లేక
నిస్సహాయంగా నిలిచుండిపోయిన మానవాలిపై
వాయువస్త్రాన్ని ప్రయోగించి, 
గాలిని స్తంభింపజేసిన ఈ కరోనా.. అతిదారుణంగా
మానవాళిపై విరుచుకుపడి జీవితాల్ని
చిదిమేస్తుంటే.. వింతగా,
విచిత్రంగా చూస్తోంది ఈ కాలం.

కరోనా ప్రకటించిన ఈ యుద్ధంలో
చివరి వరకూ పోరాడి,
అసువులు బాసిన నా ప్రియ మిత్రుడు
శేఖర్ మనసుకు శాంతి కలగాలని
కాలంతో పాటు అన్ని చూస్తున్న
భగవంతుణ్ణి ప్రార్థిస్తూ...

మిత్రులారా..
ఇది అత్యంత కఠినమైన కాలం.
అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ
మాస్కులను ధరించి
ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలని కోరుతూ..

Stay Strong... Stay Safe





Tuesday, April 13, 2021

కరోన...

కరోనా..
ఎందుకే మాపై ఈ విజృంభన.

గాలిని కాలుష్యం చేశామనా..
ఆ గాలినే గుండెకు అందకుండా చేస్తున్నావ్.

నీటిని కలుషితం చేశామనా...
ఫ్లూ లా మారి దగ్గు, జలుబుతో దంచేస్తున్నావ్.

పచ్చదనాన్ని కాల్చి బూడిద చేశామనా..
పండుటాకుల్లా ప్రాణాలను తుంచేస్తున్నావ్.

భూమిని రసాయనాలతో నింపామనా..
మందు లేని రోగాన్ని సృష్టించావ్.

ప్రకృతి మొత్తాన్ని పాడు చేస్తున్నామనా...
ప్రాణాలతో ప్రళయం సృష్టిస్తున్నావ్.

జ్ఞాపకాల తెర



Naa Gnapakalu
జ్ఞాపకాల తెర..


నా హృదయం బరువుగా కదలాడుతోంది .
ఏదో జ్ఞాపకాల తెర...

నను , నా మనసును ,
అతలా కుతలం చేస్తోంది .-

ఎంత వెదికినా ...
కనిపించని ఆ చిరునవ్వు
నాముందు నాట్యం చేస్తున్నట్టు..-

ఆ తొలకరి జల్లులలో
నామది తడిసి పోతున్నట్టు.. -

ఆ రూపం
నా మదిలో గుడి కట్టుకున్నట్టు ..-

ఆ అడుగులతో కలిసి
నా అడుగులు పంచుకున్నట్టు ..-

ఆ కౌగిలిలో
నేను తన్మయత్వం చెందినట్టు ..-

ఆ జ్ఞాపకాలు ...
నను అల్లుకుంటున్నాయి
మదిలో అలజడి పుట్టిస్తున్నాయి .

అన్నట్టు ...
ఇవి అనిపిస్తున్నవి కాదు
రోజు ఉహలుగా నా ముందు కనిపించేవి .

10వ తరగతి నాటి
జ్ఞాపకాల తెరలు
నా ముందు కదలాడుతూ
నను అల్లు కుంటున్నాయి .

ఆ వీక్షణ , నిరిక్షణలు ..
నాతొ సహగామిస్తున్నాయి .

- సింహ తొడేటి

greetings




Thursday, June 1, 2017

Prema Go..daari!!!

యేదారి లేని వాడి దారి గోదారి..!!
సామెత వినడానికి బాగుంటుంది.. ఎందుకంటే అందులో మనం లేము కాబట్టి.
గోదారి ఎన్నో మధుర జ్ఞాపకాల జాబిలి..
అది అమావాస్య అయినా.. పున్నమి అయినా..
మార్పు ప్రకృతి లో ఉంటుంది, చంద్రునిలో కాదు.
నా జ్ఞాపకాల గోదావరి లో..
అమృతపు చిరు జల్లులున్నాయ్..
అలజడులు అల్లరి అలలున్నాయ్..
నిలువునా తడిపేసే కన్నీటి సుడులున్నాయ్..
అందనివాన్ని అందమయినవే...
నా గోదారి అందని ద్రాక్ష కాదు..
అందమయిన జ్ఞాపకం.

-సింహ తోడేటి






Sunday, April 2, 2017

Dream Big

పలికే కాగితం ఉంటుందా..
పాడని కోయిల ఉంటుందా..
టాలెంట్ లేని మనిషి ఉంటాడా..???
ఒక
ఆలోచన..
ఆచరణ..
అద్భుతం..
వీటి కలయికే మనిషి.

Gamyam

లెయ్
లెయ్
లెయ్
ఎన్నాళ్ళీ తిట్లు..
ఎన్నాళ్ళీ అగచాట్లు..
ఓటమి చేసిన గాయాన్ని..
మనుషులు చేసిన గేలిని..
పూకటి వేళ్ళతో తెంపెయ్.
రాముని భాణంలా..
భూమిని తాకిన బంతిలా..
సచిన్ స్ట్రైట్ డ్రైవ్ లా..
వెయ్
లక్ష్యం వైపు వాడిగా అడుగులెయ్.