Friday, February 13, 2009

Happy Valentines Day


ప్రతి పుట్టుక ప్రేమకోసమే ...
ప్రతి కలయిక ప్రేమకోసమే ...
ప్రేమకోసమే నా జీవితం ...
ప్రేమికుల కోసమే అది అర్పితం .
అంటు ...
ప్రేమకు ప్రాణం పోసిన
valentine జ్ఞాపక చిహ్నమే ఈ రోజు . -
-------
ప్రేమకై తన సర్వస్వాన్ని కోల్పోయి
తన మధురమైన ప్రేమకు
అందాల తాజ్ ను గుర్తుగా మలచిన
షాజహాన్' ప్రేమ పుట్టినరోజు ఈ రోజు .-
------
ప్రేమే పాసానమై
ఆల్కహలె తన ఆయువై
మరణానికి సైతం ,
చిరునవ్వులతో ఆహ్వానం పలికిన
దేవదాస్ పార్వతి' ల ప్రేమకు నిదర్సనం ఈ రోజు .-
-----
ప్రేమించి ప్రేయసి నుండి
ఆమె పెళ్లి లేఖను అందుకొని
బ్రతకలేక ..
చావు రాక ..
బ్రతుకును సాగించి
మరణాన్ని ముద్దుగా పిలుచుకున్న
మజ్ను ' మరనదినం ఈ రోజు .-
-----
ప్రేమీ మా ప్రాణం ..
ప్రేమే మా పయనం ..
మా ప్రేమ శాశ్వతం ..
అది కాదో మరణం ...
ఇలా ప్రేమను పూజిస్తూ
దాని వెలుగును సేవిస్తూ
కలిసి సాగే ప్రేమికులకు
ప్రేమ అందించిన వరం ఈ రోజు .
అదే ఈ ప్రేమికుల రోజు .
-శ్రీ సింహ .