Monday, December 1, 2008

ప్రేమే పాశమా?











నా జీవిత మధుర స్వప్నాన ...
నీవొక చెదరని సంఘటన !.

నా హృదయాలయాన ,
దేవతలా వెలసి ...
అనుక్షణం ..!
నా ఊహల తలపుల్లో ...
తేలియాడుతున్న ,
ఓ ప్రియతమా ...
నాపై ,
దయచూపుమా...
నను ,
దరిచేర్చుమా ...
.....
కారు చీకటిలో ,
కాంతి రేఖ వనుకున్నా ...
కాటిన్యంతో స్తంబించిన నా హృదయంలో,
కరుణ రాగానివనుకున్నా ..
అలసట ..!
ఆర్తితో ...

అలమటిస్తున్న జీవితాన ,
అనురాగ దీపిక వనుకున్నా ...
మూగబోయిన నా యదలయన ,
బావ కావ్య గితికవనుకున్నా ...
.....
ఇంతలోనే ,
నమ్మలేక పోతున్నా ...
ఆ అలజడికి తాలలేకున్నా ..!
కారణాలను అన్వేసిస్తున్నా ..!
నీ జ్ఞాపకాల వీక్షణలో ,
సుదీర్గంగా ఆలోచిస్తున్నా ..!
బ్రాంతితో..
నన్ను నేను ఓదార్చుకుంటున్నా ..!
.....
నీ వలపుల తలపులు
తీగలుగా అల్లుకున్న నా హృదయకుటీరంనేడు ...
శిధిలమై పోయింది.
నా ప్రస్తానమే లేక
నా లేత హృదయం
శిలలా .. ఆగిపోయింది.
ఒంటరిగా .. మిగిలిపోయింది.
.....
చెలీ...!
ఓ నిమిశం ఆలోచించుమా...
నేను ,
నీకు ఏమి ఇవ్వగలను ,
ఒక్క ...
నిస్కలమైన నా ప్రేమనుతప్ప .
ఏమి చేయగలను ,
నిన్ను ఆరాదించడం తప్ప .