
Friday, December 19, 2008
Monday, December 1, 2008
ప్రేమే పాశమా?

నా జీవిత మధుర స్వప్నాన ...
నీవొక చెదరని సంఘటన !.
నా హృదయాలయాన ,
దేవతలా వెలసి ...
అనుక్షణం ..!
నా ఊహల తలపుల్లో ...
తేలియాడుతున్న ,
ఓ ప్రియతమా ...
నాపై ,
దయచూపుమా...
నను ,
దరిచేర్చుమా ...
.....
కారు చీకటిలో ,
కాంతి రేఖ వనుకున్నా ...
కాటిన్యంతో స్తంబించిన నా హృదయంలో,
కరుణ రాగానివనుకున్నా ..
అలసట ..!
ఆర్తితో ...
అలమటిస్తున్న జీవితాన ,
అనురాగ దీపిక వనుకున్నా ...
మూగబోయిన నా యదలయన ,
బావ కావ్య గితికవనుకున్నా ...
.....
ఇంతలోనే ,
నమ్మలేక పోతున్నా ...
ఆ అలజడికి తాలలేకున్నా ..!
కారణాలను అన్వేసిస్తున్నా ..!
నీ జ్ఞాపకాల వీక్షణలో ,
సుదీర్గంగా ఆలోచిస్తున్నా ..!
బ్రాంతితో..
నన్ను నేను ఓదార్చుకుంటున్నా ..!
.....
నీ వలపుల తలపులు
తీగలుగా అల్లుకున్న నా హృదయకుటీరంనేడు ...
శిధిలమై పోయింది.
నా ప్రస్తానమే లేక
నా లేత హృదయం
శిలలా .. ఆగిపోయింది.
ఒంటరిగా .. మిగిలిపోయింది.
.....
చెలీ...!
ఓ నిమిశం ఆలోచించుమా...
నేను ,
నీకు ఏమి ఇవ్వగలను ,
ఒక్క ...
నిస్కలమైన నా ప్రేమనుతప్ప .
ఏమి చేయగలను ,
నిన్ను ఆరాదించడం తప్ప .
Tuesday, November 25, 2008
నా పాట
నా కలం నుండి పుట్టుకొచ్చిన అక్షరాలకు రూపం ఈ పాట .
పల్లవి :
ఆ కన్నె ఎవరో ఎవరో ...
నా రాగమాలిక ఎవరో ...
నా గుండె దోచిన రాణి
నా వన్నెల దొరసాని .
"ఆ కన్నె"
చరణం :
అడిగానే ని జాడని
ఆకాశంలో తారలని.
నడిచానే ఈ నేలపయ్
నీ చరణాల చిరునవ్వుకయ్.
రావే నా ప్రియ రసమంజరి "2 "
నీ కోసమే నిలిచెను .. నా ఉపిరి .
"ఆ కన్నె "
పల్లవి :
ఆ కన్నె ఎవరో ఎవరో ...
నా రాగమాలిక ఎవరో ...
నా గుండె దోచిన రాణి
నా వన్నెల దొరసాని .
"ఆ కన్నె"
చరణం :
అడిగానే ని జాడని
ఆకాశంలో తారలని.
నడిచానే ఈ నేలపయ్
నీ చరణాల చిరునవ్వుకయ్.
రావే నా ప్రియ రసమంజరి "2 "
నీ కోసమే నిలిచెను .. నా ఉపిరి .
"ఆ కన్నె "
Tuesday, November 18, 2008
Sreenu Happy Married life.18.11.08
Friday, November 14, 2008
Wednesday, November 12, 2008
Sunday, November 9, 2008
Friday, November 7, 2008
కవిత
8.11.2008
నే ఒంటరిని ..
హృదయం అనే కోవెలలో
ఊగిసలాడుతున్న ఓ నవ వసంతమా...
నీ నామంలో ..
ఏ ప్రణయ రహస్యం దాగుందో -
నీ రూపంలో ..
ఏ ప్రకృతి సౌందర్యం తలదాల్చిందో -
చెలీ...
అపురుపమైన
నీ రుపలావన్యాల జడివానలో తడిసి ,
నీ అందం నుండి జాలువారిన పన్నిటి బిందువులను
నా కనురెప్పల దోసిళ్ళలో బంధించి ,
నీ చిత్ర లేఖలను చూసుకుంటూ ..
నీ అనురాగాన్ని తలుచుకుంటూ ..
నీ చిరునవ్వులో తొలకరిని -
ఈ అనంతవిస్వంలో నే నొంటరినై -
నీ జ్ఞాపకాలతో గడిపేస్తున్నా ...
నీ ప్రేమతో బతికేస్తున్నా ...
Friday, October 31, 2008
Subscribe to:
Posts (Atom)